ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా గుండ్రెడ్డి శివ, రూ.50 వేల ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్న దాత
బాపట్ల: ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి, తన వంతు సహాయాన్ని అందిస్తూ గుండ్రెడ్డి శివ మానవత్వాన్ని చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న వారికి “నేనున్నాను” అంటూ భరోసా కల్పిస్తూ తన సేవా దృక్పథాన్ని మరోసారి చాటుకున్నారు.
చెరువు ఉప్పరపాలెంకు చెందిన ఓ మహిళ మరియు ఆమె కుమారుడు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందిన విషాద ఘటనపై గత రెండు రోజులుగా వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఈ విషాద ఘటన గురించి గుండ్రెడ్డి శివ తన అనుచరుల ద్వారా తెలుసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే తీవ్రంగా చలించిపోయిన ఆయన, బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు స్వయంగా వెళ్లారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి దుఃఖంలో తానూ భాగస్వామినని భరోసా కల్పించారు. కుటుంబానికి తన వంతు సహాయంగా రూ.50,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచిన గుండ్రెడ్డి శివను పలువురు అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు చింతా కిషోర్ కుమార్, వుసా రాంబాబు, బాపట్ల బ్రదర్స్ తరఫున భాస్కర రాజు, జేడీ ప్రసాద్, రాధాకృష్ణ, రమేష్, చాన్ రెడ్డి, దీపక్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
